భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి నోముల విజయకుమారి సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు.

నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రారంభ…