భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడమే చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రధాన ఉద్దేశమని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పట్టకుండా వాటిని అర్థం చేసుకుని సొంతంగా ఆలోచించే అలవాటు పెంచుకోవాలని సూచించారు.
ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్)లో శనివారం జన విజ్ఞాన వేదిక ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్–2026 నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన…






