భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తెలంగాణ బాలికల జట్టు తరఫున హుస్నాబాద్‌కు చెందిన బానోత్ అఖిల ఎంపికైంది. ఈ నెల 24 నుంచి 28 వరకు పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో నిర్వహించనున్న 44వ జాతీయ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనుంది.

రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన అఖిలకు గ్రామస్థుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మల్‌చెరువు తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు…