భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, దానికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి సూచించారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. జూట్ సంచుల వినియోగం పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా సమీపంలో ఉన్న మున్సిపల్…






