భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ హుస్నాబాద్ డివిజన్ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ అధికారులు, పాలకవర్గాన్ని కోరారు. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వృద్ధులు, దివ్యాంగులు వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు పై అంతస్తులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మున్సిపల్ కార్యాలయంలో లిఫ్టు ఏర్పాటు చేయాలనే విషయాన్ని గతంలో పలుమార్లు…