భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న తొలిముద్ద కార్యక్రమాన్ని మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లిలో బుధవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు స్వయంగా కిచిడి వడ్డించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న 3 నుంచి 6 సంవత్సరాల లోపు ప్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడమే తొలిముద్ద కార్యక్రమం…






