భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వడ్రంగి వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నైపుణ్యకారుడు పోలోజు బిక్షపతి చారి (86) కన్నుమూశారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న నైపుణ్యకారుడు దూరమయ్యాడని గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

వడ్రంగి వృత్తిలో బిక్షపతి చారికి ఎంతో అనుభవం, అసాధారణ ప్రతిభ ఉండేది. ఎలాంటి డిజైన్‌తో కూడిన చెక్క వస్తువునైనా…