భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ నమోదు ప్రక్రియ హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ప్రారంభమైంది. పట్టణంలోని బస్టాండ్ వెనుక ప్రాంతంలో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఈ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ కొండ రజిత సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని…






