భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: మహిళల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ కార్మికుల సంక్షేమం, లింగ సమానత్వం సాధించడమే లక్ష్యంగా గ్రామస్థాయిలో జెండర్ కమిటీని ఏర్పాటు చేశారు. నవక్రాంతి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న బెటర్ కాటన్ ఇనిషియేటివ్ (బీసీఐ) ప్రాజెక్టులో భాగంగా అక్కన్నపేట మండలం గండిపల్లిలో గురువారం కమిటీ పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, సభ్యుల విధులు, బాధ్యతలను గ్రామస్థులకు వివరించారు.

గ్రామంలో మహిళలు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి…