భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంటను మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఇనుగుర్తి మండలం మీట్యా తండా సర్పంచి భూక్య చిన్ని వెంకన్న సూచించారు. రైతులకు మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకోవాలని కోరారు.
ఇనుగుర్తి మండలం మీట్యా తండా పరిధిలో రాజమాత ఐకెపి కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సర్పంచి భూక్య చిన్ని వెంకన్న, ఏపీఎం రాజేంద్ర…






