భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థుల్లో భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఐదో తరగతి నుంచే రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని హోలియదాసరి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శాఖమూరి యాదగిరి హోలియదాసరి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి వరకు మాత్రమే కాకుండా ఉన్నత విద్యలోనూ రాజ్యాంగాన్ని ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం వంటి కీలక అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని…






