భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నెలల తరబడి కష్టపడి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వరద నీరు పోటెత్తడంతో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం కొంత పూర్తిగా కొట్టుకుపోగా, మిగిలిన ధాన్యం తడిసి ముద్దయింది.
గ్రామంలోని కోనాపూర్ బండపై సుమారు 30 మంది రైతులు కోసిన ధాన్యాన్ని…






