భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయ అధికారిణి దీపిక సూచించారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.

వ్యవసాయ అధికారిణి…