భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తున్నాయని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక వాహన…