భారత్ సమాచార్, మెదక్ జిల్లా: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని బి.వి.రాజు సాంకేతిక విద్యాసంస్థ (బివిఆర్ఐటీ) ఆధ్వర్యంలో నర్సాపూర్‌లోని విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు, విద్యార్థుల జీవితంలో పుస్తకాల పాత్ర గురించి ఈ కార్యక్రమంలో వివరించారు.

ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో గ్రంథాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ అంశాలకు…