భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన భూముల రీసర్వే పూర్తయిన నేపథ్యంలో రామాంజపురం గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ చంద నరేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీసర్వేకు సంబంధించి రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆర్డీఓ గణేష్ సూచించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ గణేష్ మాట్లాడుతూ గ్రామంలో భూముల రీసర్వే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సర్వేకు సంబంధించిన వివరాలను రైతులకు…






