భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;

కొద్ది మంది భూతల స్వర్గంలా భావించే అమెరికా దేశంలో, ఆకాశహర్మ్యాలు ఉన్న నగరంలో, పూర్తిగా పుస్తకాలతో నిండిపోయిన ఓ ఇరుకు గదిలో. భారతీయ విద్యార్థి రాము శాంటా విశ్వవిద్యాలయంలో “హ్యూమన్ రిలేషన్స్” అనే అంశంపై కొంత కాలంగా పీహెచ్‌డీ సాధించటానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వ మానవ జీవపరిణామక్రమ పుట్టుపూర్వోత్తారాలను పూర్తిగా అధ్యాయం చేయటానికి చార్లెస్ డార్విన్ జీవపరిణామ క్రమ సిద్దాంతాన్ని మళ్లీ మళ్లీ తిరగేస్తున్నాడు. చేతిలో పుస్తకం పక్కనే సగం తాగి వదిలేసిన మందు గ్లాస్. అందులో ఒక…