భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కోడుమూరులోని గుంతకంటి వారి వీధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను సీపీఎం మండల కార్యదర్శి వీరన్న గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలు రెండు వైపులా పూడిపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసనతో స్థానికులు రోజువారీ జీవనం సాగించలేకపోతున్నారని, మురుగు నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి…
గుంతకంటి వీధిలో డ్రైనేజీ సమస్యపై ఆగ్రహం




