భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఐడిఓసీ కార్యాలయంలో సోమవారం ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో భూ భారతి 34,పెన్షన్14 ,ఇందిరమ్మ ఇండ్లు 5,ఇతర…