భారత్ సమాచార్, మెదక్: వెల్దుర్తి మండలం ఎల్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేందర్, అశ్విని లావణ్య ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మలు తయారుచేసి పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసి ఆటలు ఆడి, పాటలు పాడారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం కోసం బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు.