భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు రాజకీయ పార్టీలను కోరారు. పత్తికొండ మండలం రామచంద్రాపురం కోట్టాల గ్రామంలో బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఎంకే నాగరాజు రావు నివాసంలో శనివారం ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో బ్రాహ్మణుల సమస్యలను గళం విప్పే అవకాశం తగ్గిపోయిందని తెలిపారు. అందువల్ల, రాబోయే…