భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రంగుల పండుగ హోలీ మన జీవితాల్లో ఆనందాన్ని, ఐక్యతను నింపే పవిత్ర వేడుక అని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ సిఆర్ పేర్కొన్నారు. చెడుపై మేలు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ, మనసులోని ద్వేషాలను కరిగించి ప్రేమ, సహనంతో నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సమాజంలో పరస్పర గౌరవం, సామాజిక స్పృహ పెంపొందాలని కోరారు.

పేద, ధనిక భేదం లేకుండా అందరూ కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని,…