భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఉత్తర మండలం సెక్షన్, సబ్‌డివిజన్ నెల్లికుదురు ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించింది. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు పలు భద్రతా సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఎన్. సింధు మాట్లాడుతూ, జి.ఐ. వైర్లపై దండల మాదిరిగా బట్టలు…





