భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా మున్సిపాలిటీ పరిధిలోని న్యూ సంతోషిమాత కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదో తరగతి విద్యార్థిని శ్రీదేవిక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను చాటుతూ కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆమె స్వయంగా వినతిపత్రం అందజేయడం అందరి ప్రశంసలు అందుకుంది. కాలనీలో రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వినతిలో పేర్కొంది.
భైంసా సబ్ కలెక్టర్ అజ్మెరా…





