భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరటనిస్తోందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, వెల్దుర్తి మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులు సీఎం రిలీఫ్…





