భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ : జిల్లా కలెక్టర్‌ రాహుల్ రాజ్ మంగళవారం రేగోడు మండలంలోని పశువైద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణ అత్యంత ముఖ్యమని, వైద్యశాలల్లో ఉత్తమ సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించరాదని ఆయన స్పష్టం చేశారు.

కలెక్టర్ ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. పశువులకు అందిస్తున్న టీకాలు, నులిపురుగుల నిర్మూలన వంటి కీలక కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీశారు. వైద్యాలయంలోని సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, రైతులకు…