భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా లైన్ ఏర్పాటు విషయంపై కలెక్టర్ ఆదర్శ్ సురభి తన చాంబర్లో డీఎఫ్ఓ అరవింద్ ప్రసాద్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే స్థలం గురించి అధికారులు చేసిన సర్వే నివేదికను పరిశీలించారు. ఇందుకోసం మొత్తం 1526 మీటర్ల అటవీ భూమి అవసరం పడుతుందని సర్వే నివేదికలో పేర్కొనగా, ఇందుకు…