భారత్ సమాచార్, ఏపీ: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సందడి భారీగా పెరిగింది. ఆగస్టు చివరి వారం నుంచి భక్తులు సాధారణ రోజుల కంటే భారీగా దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి వచ్చిన భక్తులు కనీసం 24 గంటలు క్యూలో నిలబడి వేచి చూడాల్సి వస్తోంది. శ్రీకృష్ణా గెస్ట్ హౌస్ పరిసరాల నుండే క్యూలైన్లు మొదలయ్యాయి. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
టీటీడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క నిన్ననే 59,800 మందికి పైగా…




