భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ వార్డు సభ్యులు చిర్రగోని కిరణ్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారుడు గుగులోతు రాజేష్ కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తోందన్నారు. కార్యక్రమంలో ముత్యాల యాకయ్య బాణాలయ దిలీప్ పాల్గొన్నారు.