భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కోడుమూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి గురువారం తనిఖీ చేశారు. సంబంధిత అధికారులతో కలిసి పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను క్రమబద్ధంగా అమలు చేయాలని, ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో స్నేహలత, ఏడీ నాగభూషణం పాల్గొన్నారు.
కోడుమూరు పాఠశాలల్లో ఫుడ్ కమిషన్ తనిఖీ




