భారత్ సమాచార్.నెట్, మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో నిధులు మంజూరు అవుతున్నాయని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాలుగో వార్డు బీసీ కాలనీలో రూ. 35 లక్షల నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సుమారు రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్…





