భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో వెలసిన పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతరలో భాగంగా రెండో రోజు సలావత్పూర్ గ్రామానికి చెందిన సంఘళ్ల సాయికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతల జాతరలు నిర్వహించడం వల్ల పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని, దైవానుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా సాయికిరణ్ అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అంతారం,…





