భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ లోని పలు హోటల్లో,రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారన్న సమాచారం అందుకున్న సివిల్ సప్లై, స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడులుచేసారు.
ఈ దాడుల్లో నర్సాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న పలు హోటలలో గల 46 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు స్పెషల్ టాస్ స్పోర్ట్స్ డిఎస్పి వెంకటేశం తెలిపారు. దాడులు నిరంతరం కొనసాగుతాయని, ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లు వాడి వ్యాపారం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదంటూ వెల్లడించారు.