భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని మహిమాన్విత శ్రీ ముత్యాలమ్మ తల్లికి బుధవారం ఇనుగుర్తి పట్టణవాసులు అత్యంత వైభవంగా బోనాల జాతరను నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆలయ ప్రదక్షిణలు చేశారు. ఆలయ గర్భగుడి ముందు ముత్యాలమ్మ, మారమ్మ, పెద్దమ్మ, లోతుగుంట మైసమ్మ తల్లులకు ప్రత్యేకంగా పట్నాలు వేశారు.…