భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్ పేట్, యూసఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.…





