భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ 11వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల 28, 29, 30 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆమెను కోరారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కటాక్షంతో ప్రాంతం నిత్యం అభివృద్ధి చెందుతోందని…