భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కరకగూడెం మండలం వీరాపురం క్రాస్ రోడ్డు నందు కొమరం భీమ్ జయంతి వేడుకలు ఆదివాసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జల్.! జంగిల్.!! జమీన్.!!! అనే నినాదంతో.. ఆదివాసీల హక్కుల కోసం నిజాం నిరంకుశత్వాన్ని ధిక్కరించి అలుపెరగని పోరాటం చేసి వీర మరణం పొందిన ఆదివాసి ముద్దుబిడ్డ గోండు బొబ్బిలి కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నుండి ఘన నివాళులు అర్పించారు. ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసి అస్తిత్వ ఆత్మగౌరవ…