భారత్ సమాచార్, కూకట్‌పల్లి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమలు చేస్తున్న EJHS (Employees and Journalists Health Scheme) ఆరోగ్య పథకం సేవల్లో కూకట్‌పల్లి కేంద్రంలో సాంకేతిక సమస్యలు పేషెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నెలవారీ మందులు తీసుకునేందుకు కేంద్రానికి వస్తున్న వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఇంటర్నెట్ సమస్యల కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న…





