భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ దాఖలు ప్రక్రియ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చిన్న శంకరంపేట్–ఆర్, రామాయంపేట్ మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలు, పోలీసులు నిర్వహిస్తున్న బందోబస్తు విధులను సమగ్రంగా పరిశీలించారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా సాగేందుకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. గుంపులు,…





