భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల పరిధిలో నూతనంగా ప్రీ-ప్రైమరీ (ఫ్రీ ప్రైమరీ) తరగతులను బోధించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మండల విద్యాధికారి (MEO) ఆంగోతు రాందాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పార్వతమ్మగూడెం, రావిరాల ప్రాథమికోన్నత పాఠశాలలను ఈ ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఎంపిక చేసిన రెండు పాఠశాలల్లో చిన్న పిల్లలకు పాఠాలు బోధించడానికి ఒక్కో పాఠశాలకు ఒక బోధకుడు (ఇన్‌స్ట్రక్టర్), అలాగే పిల్లల సంరక్షణ కోసం ఒక…