భారత్ సమాచార్.నెట్, కర్నూలు: సి.బెలగల్ మండలం పలుదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త బోయ వెంకటప్ప అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పలుదొడ్డి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, వెంకటప్ప మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుండి వెంకటప్ప అంకితభావంతో పనిచేశారని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన…




