భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట మండల వ్యాప్తంగా పర్యటించి వివిధ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల స్థితిగతులను పరిశీలించారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే ఉసిర్లగూడెం, వినాయకపురం గ్రామాలలో శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కామయ్యపాలెం గ్రామంలో వీరంకి ప్రసాద్ దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దొంతికుంటలో నూకాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి పూజకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…