భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం వర్షాకాలంలో సంభవించే విపత్తులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప తహసీల్దార్ తరంగిణితో పాటు వివిధ లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు హాజరయ్యారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు సూచించారు.
సమావేశంలో ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భారీ వర్షాలు, మానవ కారకాల…





