భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర శివాలయం, ధర్మశాల వీరభద్ర స్వామి దేవాలయంలో రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి రుద్ర నమ్మక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పాలు, నెయ్యి, తేనే, చక్కెర, నీరు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర శివాలయం వీరప్ప గురుస్వామి మాట్లాడుతూ.. మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లింగోద్భావ కాలంలో విశేష అభిషేకాలు ఉంటాయని, సాయంత్రం జాగరణ, భజన మండలి వారిచేత శివనామ స్మరణ…