భారత్ సమాచార్, హైదరాబాద్: దేశంలో బ్యాంకింగ్, రైల్వే టికెటింగ్, పోస్టల్ సేవలు, పెన్షన్ పథకాలతో సహా పలు రంగాలలో అక్టోబర్ 1వ తేదీ నుంచి పలు మార్పులు రానున్నాయి. కొత్త నిబంధనలు, రుసుములు అమలులోకి రానునండడంతో ఈ మార్పులు సామాన్య ప్రజల దైనందిన లావాదేవీలపై ప్రభావాన్ని చూపనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 4వ తేదీ నుంచి చెక్ క్లియరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రస్తుత ‘బ్యాచ్ సిస్టమ్’ స్థానంలో ఇన్‌స్టాంట్ క్లియరింగ్ విధానం వస్తుంది. ఈ మార్పు రెండు దశల్లో జరుగుతుంది.…