భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా:  జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు గత 18 నెలల నుండి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ చేపట్టటం జరిగినది.  అప్పటి నుండి ప్రయాణికులు వెయిటింగ్ హాల్ లో, ప్లాట్ఫారం మీద ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. ప్రయాణికుల కొరకు ఏర్పాటు చేసిన కుర్చీలు,  బెంచీలు తీసేసారు. వృద్దులు, వికలాంగులు, బాలింతలు, చంటి పిల్లల తల్లులు ప్లాట్ ఫామ్ పైన నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్నా రైల్వే అధికారులకు పట్టట్లేదని…