భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్‌పై లోక్‌సభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అమిత్ షా పంచుకున్నారని పేర్కొన్నారు.
ఉగ్రవాదులను ఏరివేయడంలో ఈ రెండు ఆపరేషన్‌లు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. తన ప్రసంగంలో, దేశ భద్రతను నిర్ధారించడానికి భారత్ ప్రభుత్వం చేస్తున్న…




