భారత్ సమాచార్.నెట్, అనంతపురం: అత్తింటి కష్టాలకు మరో గర్భిణీ బలి అయింది. భర్తతోపాటు, అత్తమామలు నిత్యం వరకట్నం తేవాలని వేధించడంతో గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి(23)కి నాలుగేళ్ల క్రితం గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులతో వివాహం అయింది. అత్తింట్లో కాలుపెట్టిన తర్వాత శ్రావణి కాపురం కొంతకాలం సాఫీగానే జరిగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్తతోపాటు, అత్తమామలు నిత్యం మాటలతో చిత్రహింసలు…
అదనపు కట్నం కోసం చిత్రహింసలు.. అత్తింటి వేధింపులు భరించలేక .!



