భారత్ సమాచార్.నెట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తమ ఇల్లును మున్సిపల్ అధికారులు కూల్చడంతో ఓ మహిళ పశువులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చిన ఘటన భూపాలపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. మంజూరునగర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ రోడ్డు కోసం ఓదెలు అనే వ్యక్తి పశువుల కొట్టాన్ని(పశువుల పాక)ను మున్సిపల్ అధికారులు కూల్చారు. దీంతో స్కూల్ రోడ్డు కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన పశువుల కొట్టాన్ని కూల్చేయించాడని ఆగ్రహించిన ఓదెలు, తన భార్య కలిసి తమ పశువులను ఎమ్మెల్యే గండ్ర క్యాంప్…