భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: కౌడిపల్లి మండల కేంద్రంలో ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’ రామానంద చటర్జీ 161వ జయంతి వేడుకలను స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వాహకులు నాగరాజు చారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ కాలంలో జర్నలిజం ద్వారా ప్రజలను చైతన్య పరిచిన మహనీయుడు చటర్జీ అని…